తాడిపత్రి: తాడిపత్రి ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరిపై ఫైర్ అయిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,
తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'నువ్వు ఎవరో ప్రజలకు తెలుసా? ఏ రోజైనా నువ్వు ఇంటి నుంచి బయటికి వచ్చావా? ఘర్షణలు జరుగుతుంటే ఇంట్లో దాక్కొని బయటకు వస్తావా? ఐపీఎస్ ఎలా అయ్యావో. ఎప్పుడు కేసు పెట్టాలో కూడా తెలియదు. నేను వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందని చెబుతావా? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ తగ్గింది. నిన్ను వదలను. నోటీసులు ఇస్తా' అంటూ జేసీ హెచ్చరించారు.