రాజమండ్రి సిటీ: కొవ్వూరులో రైళ్ల నిలుపుదల కోసం రైల్వే పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్ష
కోవిడ్ సమయంలో రద్దు చేసిన అన్ని రైళ్ళను తిరిగి కొవ్వూరు రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ పై రైల్వే శాఖ వివక్ష చూపుతోందని సమితి సభ్యులు ఆరోపించారు. డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో రైళ్లను నిలుపుదల చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.