కుప్పం: అన్నదాతకు అండగా ప్రభుత్వం : ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కూటమి ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉండి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. రైతన్న.. మీకోసం కార్యక్రమంలో భాగంగా కంగుందిలో రైతులు వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం సందేశాన్ని రైతులకు వివరించారు.