పలమనేరు: 37లక్షల రూపాయల ఆధునాతన అంబులెన్స్ ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే,దాని యొక్క ఉపయోగాలు వివరించారు
పలమనేరు: పట్టణం వంద పడకల ఏరియా ఆసుపత్రి వద్ద నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి 37 లక్షల విలువగల ఆధునాతన అంబులెన్స్ ను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆసుపత్రి వర్గాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించిన ఆధునాతన రెండు అంబులెన్స్‌లలో ఒకటి పలమనేరుకు కేటాయించడం హర్షనీయమన్నారు. ముఖ్యంగా ఎక్కువ హైవేలు ఉండి తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశం పలమనేరు కాబట్టి ప్రజలకు ఈ అంబులెన్స్ అత్యవసరం అన్నారు.