సంగారెడ్డి: అద్వానంగా ఉన్న రోడ్ల కు మరమ్మత్తులు చేపట్టాలి: ఆదిత్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిలు
సంగారెడ్డిలోని రోడ్ల అధ్వాన స్థితిపై ఆదిత్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు స్థానికులతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బృందావన్ కాలనీ చౌరస్తాలో ఇరవై రోజులుగా ఉన్న గుంతల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.