ఆత్మకూరు: సంగంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన పోలీసులు
సంగం లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఐ వేమారెడ్డి ,ఎస్సై రాజేష్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి.. మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వారిసేవలను నిరంతరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయటమే కాక శాంతి భద్రతల పరిరక్షణలో అనేకమంది అమరులైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.