కడప: రేపు వైయస్సార్ స్టేడియంలో నిర్వహించనున్న యోగా కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్
Kadapa, YSR | May 31, 2025 జూన్ ఒకటో తేదీన స్థానిక వైయస్సార్ స్టేడియం లో నిర్వహించనున్న యోగా కార్యక్రమ ఏర్పాట్లను శనివారం సాయంత్రం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. స్టేడియంలోపల స్టేజి, యోగా చేసే ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.30 సెక్టార్లుగా విభజించుకుని వందమందికి ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే స్టేడియంలోని నాలుగోవైపులా త్రాగునీటి వసతులు కల్పించాలన్నారు. అలాగే మెడికల్ టీమ్, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.