కర్నూలు: ప్రజలకు ఉచిత పథకాలు అందించడంలో ఉన్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యపై శ్రద్ధ చూపడం లేదు: కర్నూలులో ఏఐటియుసి నాయకులు
ప్రజలకు ఉచితలను ,పథకాలను , అందించడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప విమర్శించారు. బుధవారం ఉదయం 12 గంటలు ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపుమేరకు సమ్మె సన్నాహక దశల వారి ఆందోళన కార్యక్రమాలలో భాగంగా కర్నూల్ నగర పాలక సంస్థ ప్రజా ఆరోగ్య విభాగంలో పనిచేయుచున్న పారిశుద్ధ కార్మికులు ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు.