డోన్: రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు బేతంచర్ల సీఐ వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | Jun 7, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రౌడీషీటర్లు నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ తప్పదని బేతంచర్ల సీఐ వెంకటేశ్వరావు హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అల్లర్లకు, ఘర్షణలకు పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్లో ఎస్సై రమేశ్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు