ఒంగోలు అర్బన్: 24వ పులకేసి జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ వాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారు: జనసేన జిల్లా అధ్యక్షుడు
Ongole Urban, Prakasam | Apr 2, 2026
హింసించే 24వ పులకేసిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడని సొంత పార్టీ నేతలు కూడా అసహ్యించుకుంటున్నారు అంటూ జనసేన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు హుడా చైర్మన్ షేక్ రియాజ్ విమర్శించారు. ఒంగోలులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై అవాకులు సవాకులు పేలే జగన్మోహన్ రెడ్డి మతి ఉండి మాట్లాడుతున్నాడా గతితప్పి మాట్లాడుతున్నాడు అంటూ విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ గురించి తెలియని వాళ్లు కూడా నేడు ఆ శాఖను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతుంటే మతిభ్రమించి జగన్ మాట్లాడుతున్నాడని విమర్శించారు