ఒంగోలు నగరంలో విజయవంతమైన కేంద్ర కార్మిక సంఘాల బంద్
Ongole Urban, Prakasam | Jul 9, 2025
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బుధవారం నాడు చేపట్టిన బంద్ ఒంగోలు నగరంలో విజయవంతమైంది. కేంద్ర కార్మిక సంఘాలు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి అనుబంధ సంఘాలతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ వరకు నిరసన తెలిపారు. కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతాంగాన్ని గాలికి వదిలేసి మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై మోడీ ప్రభుత్వం పున పరిశీలించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.