ఎల్లారెడ్డి: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు జీవనాధారంగా మారుతున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులైన 59 మందికి 16 లక్షల 95 వేల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం తనకు వ్యక్తిగత సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.