జిల్లాలో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగుతాం: సిపిఐ పార్టీ డిమాండ్
జిల్లా లో 80 శాతం మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని,ఎకరాకు 50వేలు పేట్టుబడి పెడితే పంట చేతికొచ్చిందని తీరా అమ్ముకునేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని,ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మద్దతు ధర అమలు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతూ క్వింటా 2500 కి అమ్మాల్సిన రేట్ నుండి 1500 రుపాయలకు అమ్మాల్సి వస్తుందని,తడిచి ఏమి తోచక నష్టం తో ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు లబో ధిబో మంటున్నారని, కలెక్టర్ స్పందించి ప్రతి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయలఎదుట నిరాహార దీక్ష చేపడుతామని సిపిఐ నాయకులు అన్నారు,