మంగళగిరి: చిరావూరు గ్రామంలో నీటమునిగి పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి: వైసిపి మంగళగిరి ఇన్చార్జి వేమారెడ్డి
కృష్ణా నదికి వచ్చిన భారీ వరద నీటి వల్ల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామంలో సుమారు 400 ఎకరాల పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయాయని మంగళగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన చిరావూరు గ్రామంలోని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.