నార్కెట్పల్లి: నల్లగొండ జిల్లా: 30 నిరుపేద కుటుంబాలకు భూదానం చేసిన మాజీ సర్పంచ్
నల్లగొండ జిల్లా చెర్వుగట్టు గ్రామంలో మాజీ సర్పంచ్ రేగట్టే నిర్మల నరసింహారెడ్డి గారు తన సొంత భూమిని దానం చేశారు. గ్రామంలోని 30 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున భూమిని అందించి, వారు ఇల్లు కట్టుకునేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.