ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 13, 2026
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు సంబంధిత శాఖలో ఉన్నతాధికారులు అమరావతి నుంచి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జల ధార జల హారతి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నీటి భద్రత లక్ష్యంగా జలధార జల హారతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఉన్నతాధికారులు తెలియజేశారు