బనగానపల్లె: ఫేక్ ప్రచారాలపై చర్యలు తీసుకోవాలంటూ బనగానపల్లె సిఐ కి ఆర్యవైశ్య సంఘం నాయకులు వినతి
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, పరువు నష్టం, విద్వేషపూరిత పోస్టులు చేస్తున్నారంటూ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళవారం. జిల్లా అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య ఆధ్వర్యంలో పలువురు సంఘం నాయకులు సీఐలకు వినతి అందజేశారు. వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.