కర్నూలు: పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో కుటుంబానికి ₹2 లక్షలు చొప్పున మంజూరు అయ్యాయి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సిఫారసుతో ఈ సాయం లభించింది. ఎంపీ కార్యాలయంలో చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పిల్లలను కోల్పోయిన వారి బాధను ఎవ్వరూ తీర్చలేరని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.