సూర్యాపేట: కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్, ఇగ నుండి చూసుకుందాం.. సూర్యాపేటలో బిఆర్ఎస్ శ్రేణుల ఫైర్
సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, కాంగ్రెస్ గుండాలా దౌర్జన్యం చేయడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిషోర్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్ రావు మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల తీరును వారు తప్పుబట్టారు. తమ నాయకులను దుర్భాషలాడిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.