వేటపాలెం మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ నియామకానికి వైసిపి నేతల డిమాండ్! ఆర్డీవోకు వినతిపత్రం సమర్పణ
వేటపాలెం మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ ను నియమించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు సోమవారం చీరాల ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.దాదాపు నాలుగు నెలలుగా మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు,రైతులు అవస్థలు పడుతున్నారని వారు చెప్పారు.మండలానికి ఇన్చార్జిగా ఉన్న చీరాల తహసిల్దార్ పూర్తి సమయాన్ని కేటాయించలేకున్నందున ప్రజల పనులేవీ జరగడం లేదని వారు చెప్పారు.