సమిశ్రగూడెంలో పోలీసు కవాతు నిర్వహించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ ఘటన నిడదవోలు రూరల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు (మంగళవారం) తూగో జిల్లాలోని సమిశ్రగూడెంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని సమిశ్ర గూడెం ఎస్సై రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఎన్నికల్లో భాగంగా అన్నవరం చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలతో గ్రామంలో కవాతు నిర్వహించి ఓటర్లలో మనోధైర్యాన్ని నింపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..