నంద్యాల అర్బన్: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Nandyal Urban, Nandyal | May 20, 2026
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తాను ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్లు తీసుకున్నానని ఈనెల 14న సిద్ధార్థ రెడ్డి ఆరోపించారని మంత్రి పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ລໍ ໖ BNS 351(2), 352, 356(1), 356(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.