హత్నూర: ఉపాధ్యాయ సంఘం నాయకులు దివంగత చార్ల మానయ్య సేవలు చిరస్మరణీయం : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి
ఉపాదేశ సంఘం నాయకులు దివంగత చార్ల మానేయ సేవలు చిరస్మరణీయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మానయ్య వర్ధంతి సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లింగాపూర్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి రాజిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం లింగాపూర్ పార్క్ లో నిర్వహించిన సమావేశంలో గర్భిణీలు బాలింతలకు మాతృదేవోభవ కార్యక్రమం ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరే కృష్ణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.