కోడుమూరు: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న బురాన్ దొడ్డి హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడికి సత్కారం
సి బెలగల్ మండలంలోని బురాన్ దొడ్డి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ముతుకూరి గోపాలచార్యులను శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. మారందొడ్డిలో జరిగిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం అనంతరం సీనియర్ డైట్ లెక్చరర్ మువ్వా గోవిందు, ఎంఈఓ, పాఠశాలల హెచ్ఎంలు ఉత్తమ ఉపాధ్యాయుడికి దుశాలువా, పూలమాల అలంకరించి సత్కారం జరిపారు. ఈ సందర్భంగా మువ్వా గోవిందు మాట్లాడుతూ గోపాలాచార్యులు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి తెలుగు భాష పై మక్కువతో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం ఎంతో గర్వకారణం అన్నారు.