గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్‌లుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం నగరంలోని జాగృతి కార్యాలయంలో ఆమెని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కవిత సత్కరించి అభినందనలు తెలిపారు.