బేతంచర్ల లో మాజీ మంత్రి బుగ్గనను కలిసిన పొదుపు మహిళలు
Dhone, Nandyal | Apr 13, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పొదుపు మహిళలు, గ్రూప్ సంఘాల సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలుగు ఏపీఎం వ్యక్తిగత కక్షలతో వేధింపులకు గురి చేస్తున్నాడని, రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని మాజీమంత్రి బుగ్గన సూచించారు.