రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రాప్తాడులో గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుచంద్రబాబు నాయుడు కృషితో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం జరిగిందని అయితే ప్రకాష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేయడంతో పరిశ్రమ వెళ్ళిపోయిందని చంద్రబాబు కృషితోనే రేమాండ్ పరిశ్రమ రాబోతుందని అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు మోడీ పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.