పశుపోషణను జీవనోపాధిగా ఎంచుకోవాలి: డాక్టర్ గణేష్
వీరబల్లి మండలం సోమవరం గ్రామాల్లో సమావేశాలలో మండల పశువైద్య అధికారి డాక్టర్ గణేష్ శుక్రవారం మాట్లాడుతూ.. పశుపోషణ మంచి జీవనోపాధిగా ఉందని తెలిపారు. ఆసక్తిగల పశువుల కొనుగోలుకు ముందుకొచ్చిన వారికి మేలురకం పశువులు ఇవ్వబడుతాయని చెప్పారు. మహిళలు సంఘాల ద్వారా రుణాలు పొందుతూ పశుపోషణలో ముందుకు రావాలని సూచించారు. పశుపోషణకు సకాలంలో సేవలు అందిస్తామని కూడా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీయం ఖాదర్ వలి, సీసీ నాగేంద్ర, విఓఏ లు కవిత, విజయమ్మ, లబ్ధిదారులు పాల్గొన్నారు.