ముచ్చు మర్రి నుండి ఓర్వకల్ పైపులైన్ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా
ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ వరకు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న త్రాగు నీటి పైప్‌లైన్ ప్రాజెక్టు పనులను నిర్దేశించిన గడువులోగా పనులను త్వరగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ వరకు జరుగుతున్న నీటి పైప్‌లైన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ప్రాజెక్టు పనుల పురోగతి,పైప్‌లైన్ ఏర్పాటు, నిర్మాణ నాణ్యత,సాంకేతిక అంశాలు,ఎదురౌతున్న సమస్యల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పనుల అమలులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దశను పర్యవేక్షిస్తూ ముం