గుంతకల్లు: కరిడి కొండ గ్రామ సమీపంలో 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు
గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రంగస్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కే ఊబి చెర్లకు చెందిన రంగస్వామి బైకులో గుత్తికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు.108 అంబులెన్స్ లో అనంతపురం తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.