కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు కనిగిరిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధ్యాయుల క్రీడలు విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తాయి అన్నారు.