చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి అధ్యక్షతన దేవుని ఎర్రవల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురు బీజేపీలోకి చేరారు. వారికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల మున్సిపాలిటీని దక్కించుకోవాలని, దానికి అందరూ కష్టపడి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొన్నారు.