బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలోని నాపరాల గనులలో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ రమేష్ బాబు
కొలిమిగుండ్ల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాపరాయి పరిశ్రమ యజమానులు గనుల్లో నిబంధనలు పాటించాలని సీఐ రమేష్ బాబు సూచించారు. సోమవారం విద్యుత్ ఏఈ పకీరయ్య, సిబ్బందితో కలిసి యజమానులు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గత నెల రోజుల వ్యవధిలోనే విద్యుత్ కారణంగా నాపరాతి గనుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందడం బాధాకరమని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు