కడప: జిల్లాలో సూపర్ జీఎస్టీ _సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Sep 25, 2025 జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్" కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లోని విసి హాలులో "సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్", జీఎస్టీ 2.0 కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి. అన్ని శాఖకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు "సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్" పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.