బనగానపల్లె: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య: చింతలాయలపల్లె ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్గ కార్యదర్శి అంబటి చంద్రశేఖర్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యనిర్వహక అంబటి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చింతలాయపల్లెలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లోని వసతులు, విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మాజీ ఎంపీపీ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.