గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లోని మద్యం దుకాణాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ ఉప కమిషనర్ నాగ మద్దయ్య
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మద్యం దుకాణాలను ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఉప కమిషనర్ నాగమద్దయ్య, ఎక్సైజ్ అధికారి రామ్మోహన్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ కె.ఉమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం మద్యం ఎ4 షాపుల తనిఖీలలో భాగంగా గుత్తి ఆర్ఎస్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను పరిశీలించారు. సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేశారు. అలాగే మద్యం దుకాణాల లైసెన్సుదారులు, సిబ్బంది, మద్యం కొనుగోలుదారులకు సురక్ష యాప్ ను మొబైల్ లలో డౌన్లోడ్ చేయించారు. మద్యం బాటిళ్లను యాప్ ద్వారా ఎలా స్కాన్ చేయాలో అవగాహన కల్పించారు.