ఒంగోలు అర్బన్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
Ongole Urban, Prakasam | May 26, 2026
ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు లోని కరవాది స్టాండ్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ ఒంగోలు గౌరవ అధ్యక్షులు తంబి శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము పెట్రోలు డీజిల్ ధరలు పెంచమని గత ప్రభుత్వం ధరలు పెంచింది మా ప్రభుత్వంలో ధర లు పెంచము 60 రూపాయలకే పెట్రోలు ఇవ్వచ్చు మిగతా టాక్స్ లన్ని వేయకుండా తక్కువ ధరలకే పెట్రోల్ డీజిల్ ఇస్తామని చెప్పి ఎన్నికలలో చెప్పటం జరిగింది గుర్తు చేశారు