సంతనూతలపాడు: వెల్లంపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్
బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తున్నామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. వెల్లంపల్లి గ్రామ అంబేద్కర్ కాలనిలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శనివారం సాయంత్రం సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మద్దిపాడు మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.