ఒంగోలు అర్బన్: ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఎపి ఎన్జీవో అసోసియేషన్
Ongole Urban, Prakasam | Apr 3, 2026
ఎపి యన్ జి ఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె శరత్ బాబు, జిల్లా కార్యదర్శి అర్ సి హెచ్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశం లో జిల్లా అధ్యక్షులు కె శరత్ బాబు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జెఏసి చైర్మన్ .అలపర్తి విద్యాసాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.డి.వి. రమణ కృషితో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 7,000 కోట్లకు పైగా బకాయిల విడుదలకు ఆమోదం తెలపడం ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే సానుకూల చర్య అని పేర్కొన్నారు.