నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో రాంగ్ రూట్ లో వస్తే ఫైన్
Nandyal Urban, Nandyal | Apr 28, 2026
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు బయటకు వచ్చే మార్గంలో ఎదురుగా వాహనాలు వస్తే ఫైన్ లు విధిస్తున్నట్లు ఆర్టిసి పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు డిపో మేనేజర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ లోకి ఎవరైనా మొదటిసారి రాంగ్ రూట్ లో వస్తే వారికి అవగాహన కల్పించి 50 రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు. అలాగే రెండోసారి వస్తే సంబంధించిన వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగిస్తున్నట్లు తెలిపారు. రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించడానికి పై అధికారుల సూచనల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు