బోయిన్పల్లి: మండల కేంద్రంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఎడవల్లి పరశురాం ఆధ్వర్యంలో,గురువారం ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతిని నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు,వివిధ కార్యక్రమాల అనంతరం పలువురు మీడియాతో 2:40 PM కి మాట్లాడుతూ, అంత్యోదయ ఏకాత్మ మానవవాద సిద్ధాంత రూపకర్త సంఘసంస్కర్త అర్థశాస్త్రవేత్త భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు దీన దయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు,నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహానుభావుడు అని కొనియాడారు,