గుంతకల్లు: పామిడి పట్టణంలో యథేచ్ఛగా ఎర్రమట్టి అక్రమ రవాణా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఎర్రమట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పామిడి తహసీల్దార్ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న పామిడి కొండలో జేసీబీ, హిటాచీ యంత్రాలతో ఎర్రమట్టి అక్రమంగా తవ్వి 25 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఫోటోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పామిడి వాట్సాప్ గ్రూప్‌లలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. పట్టణం నడిబొడ్డు మట్టిని యధేచ్చగా అక్రమంగా రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.