ఆళ్లగడ్డ: మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ వైసిపి కార్యాలయం వద్ద నల్ల బెలూన్లతో నిరసన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసిపి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు, మాజీ ఎమ్మెల్సీ, కర్నూలు పార్లమెంటు పరిశీలకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు గాలిలో ఎగురవేసి నిరసన తెలిపారు, అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు