మేడిపల్లి: చలో అసెంబ్లీకి వెళ్తున్న మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టు చేసిన కథలాపూర్ పోలీసులు
హైదరాబాదులోని అసెంబ్లీ ముట్టడికి తమ పెండింగ్ బిల్లుల సాధన కోసం వెళ్తున్న కథలాపూర్ మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు శుక్రవారం ఉదయం నుండి ముందస్తు అరెస్ట్ చేశారు, గత ప్రభుత్వం హాయంలో సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు రాకపోవడంతో, చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తారన్న నేపథ్యంలో ముందస్తుగా పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.