కందుకూరు: సైబర్ నేరాలపై అవగాహన
కందుకూరు పట్టణ శివారు ప్రకాశం కాలనీలో సీఐ అన్వర్ బాషా, రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పర్యటించారు. ప్రజలకు సైబర్ నేరాలు, గాంజా, మాదకద్రవ్యాలు, పేకాట, చైన్ స్నాచింగ్, లోన్ యాప్స్, బెట్టింగ్ గేమ్స్, ఇంటి దొంగతనాలు, రేసింగ్ తదితర నేరాలపై అవగాహన కల్పించారు. స్థానికులు పాల్గొని పోలీసుల సూచనలు శ్రద్ధగా విన్నారు.