ఒంగోలు అర్బన్: ఇచ్చిన హామీల ప్రకారం జిల్లా ఇవ్వడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయోత్సవ సభలో వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మార్కాపురంలో జరిగిన విజయోత్సవ వేడుకలలోపాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాతోపాటు అభివృద్ధి, వెలుగొండ ప్రాజెక్టు 'నేనే ప్రారంభించాను.. నేనే పూర్తి చేస్తాను' అని చెప్పిన CM మాట ప్రకారం పనులు చేస్తున్నారని MP మాగుంట అన్నారు. గిద్దలూరు, త్రిపురాంతకం, మార్కాపురం ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉండగా వాటిని అభివృద్ధి చేసేందుకు మంత్రి రామనారాయణరెడ్డి కృషి చేస్తున్నారన్నారు.