కనిగిరి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. కనిగిరి పట్టణంలోని ఏడవ సచివాలయంలో మంగళవారం సచివాలయ సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయాల సిబ్బంది విధులను నిర్వహించాలన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా నిర్దిష్ట కాల పరిమితిలో వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.