తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అనకాపల్లిలోని డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన వెలుగు వివోఏలు
జీతాల బకాయిలను చెల్లించాలని సంబంధంలేని పనుల నుండి మినహాయించాలని తదితర డిమాండ్లతో అనకాపల్లి జిల్లాలోని వెలుగు వివోఏలు అనకాపల్లి జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు, మంగళవారం తమ డిమాండ్ల సాధనకు ర్యాలీ నిర్వహించిన వివోఏలు, డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయాన్ని ముట్టడించి, తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.