రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గురువారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఉదయం ఒంగోలు నగరంలోని 19వ డివిజన్ భాగ్యనగర్ 4వ లైన్ వద్ద నుండి టుబాకో కార్యాలయం వరకు 1.50 కోట్లతో నూతంగా నిర్మించునున్న సీసీ డ్రైనేజీ కాలువకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం మాట్లాడుతూ నగరంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఊరటం ఇస్తుందన్నారు. అనంతరం నగరంలోని 32వ డివిజన్ లోని రాజీవ్ నగర్ తేజస్విని అపార్ట్మెంట్ వద్ద 1.15 కోట్లతో నిర్మించునున్న సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైనేజ్ కాలువకు శంకుస్థాపన చేశారు