ఒంగోలు అర్బన్: ఒంగోలులో భారీ చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ఒంగోలు నగరంలో భారీ చోరీజరిగింది. దాదాపు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కేజీల వెండి వస్తువులు, 50 కిలోల రాగి బిస్కెట్లను దుండగులు ఎత్తుకెళ్లారు. మంగమూరు డొంక ఆశ్రమం వెనుక నివాసం ఉంటున్న చంద్రమౌళి.. గత నెల 30న కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. శనివారం రాత్రి తిరిగి వచ్చి చూడగా.. తలుపులు విరిగి ఉన్నాయి. కంగారు పడిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో దాచిన బంగారం, వెండి వస్తువులు, రాగి బిస్కెట్లు మాయమయ్యాయి. రూ. 7 లక్షల నగదు కూడా చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమౌళి కుమారుడు శ్రీనాథ్ గాంధీ రోడ్డులోని ఓ నగల దుకాణంలో పని చేస్తుంటాడు.